జూనియర్ ఎన్టీఆర్ ధరించిన మాస్క్ బ్రాండ్ ఖరీదు ఎంతో తెలుసా

298
jr-ntr-mask-brand-and-its-price-going-viral
jr-ntr-mask-brand-and-its-price-going-viral

అభిమానులు ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ అందరికంటే ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ల గురించి బయట అందరికీ చెప్పేస్తున్నారు. వాళ్లు ఏం చేసినా కూడా అభిమానులకు అలా తెలిసిపోతుందంతే. ముఖ్యంగా వాళ్లు వాడే బ్రాండ్స్ గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా కనిపిస్తుంటారు.

 

 

వీలైతే హీరోల మాదిరే వాళ్లు కూడా చేయాలని కలలు కంటుంటారు. అందుకే వాళ్లేం చేస్తున్నారు.. ఎలాంటి బ్రాండ్స్ వాడుతున్నారు.. ఏ రకమైన బట్టలు వేసుకుంటున్నారు అంటూ గమనిస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయనేం చేసినా కూడా అభిమానుల కళ్లన్నీ ఆయనపైనే ఉంటాయి.

 

 

ముఖ్యంగా అప్పట్లో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చిన ఎన్టీఆర్ వాచ్ ఖరీదు దాదాపు 25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత అతడు వేసుకున్న షూస్ ధర కూడా 75 వేలకు పైగానే ఉంటుందని సాక్ష్యాలతో సహా ఫోటోలను విడుదల చేసారు. ఇప్పుడు ఈయన పెట్టుకున్న మాస్క్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

 

 

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి దర్శకులతో పని చేయబోతున్న ఎన్టీఆర్.. సినిమాలతో పాటు బయట కూడా బిజీగానే ఉంటున్నాడు. ఈ మధ్యే దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో కనిపించాడు ఎన్టీఆర్. అక్కడ ఆయన ధరించిన మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

 

 

చాలా సింపుల్‌గా ఫార్మల్‌లో హాజరైన ఎన్టీఆర్.. అందరితో పాటే మాస్క్ పెట్టుకున్నాడు. కానీ ఆ మాస్క్ చరిత్ర బాగానే ఉంది. అది UA స్పోర్ట్స్ మాస్క్. దాని ధర సుమారు రూ 2340. ఆ మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ హీరో అలాంటి మాస్క్ పెట్టుకున్నాడని కొందరు అభిమానులు ఇప్పుడు ఇదే మాస్క్ కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ధరించడంతో దానికి సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ వచ్చేసింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి రానుంది.