NTR movie after Devara: RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైన్దర్ దేవర ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే అయితే ఆచార్య సినిమాతో తన కెరీర్ లోనే ఒక బ్లాక్ మార్క్ గా ఉండిపోయింది. అయితే దీని నుండి బయటకు రావటానికి ఎన్టీఆర్ తో చేయబోయే దేవర సినిమాకి పక్క ప్లాన్ తో షూటింగ్ జరుగుతుంది. కొరటాల శివ ఇప్పటివరకు చేసిన సినిమా హీరోల పాత్రల కంటే విభిన్నంగా ఎన్టీఆర్ ఈ సినిమాల కనబడుతున్నట్టు తెలుస్తుంది.
NTR movie after Devara: ఈ దేవర సినిమాలో ప్రతి సీన్లు ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారు దానికి తగిన విధంగా స్టోరీ ని కూడా డిజైన్ చేసుకున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది. దేవర సినిమాని 2024 ఏప్రిల్ 5న విడుదల తేదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్గా చేస్తుంది. అయితే దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారో అనే ఎగ్జైట్ మెంట్ అయితే ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ లో ఉంది.
ప్రస్తుతానికి దేవరాజ్ సినిమా దాదాపు 40% వరకు షూటింగ్ పూర్తయినట్టు మూవీ వర్గాల సమాచారం. ఈ సినిమాని డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారంట. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్నట్టు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. దీనితోపాటు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న విషయం లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమా షూటింగ్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాకి డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం అందుతుంది. ప్రశాంత్ ప్రస్తుతం ప్రబాస్ తో సలార్ 1 సినిమాని విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కాగానే దర్శకుడు ప్రశాంత్ కూడా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ మొదలుపెడతారు మూవీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

NTR30 సినిమా దేవర అనే టైటిల్ తో వస్తుండగా NTR31 సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తుంది. దీని తర్వాత NTR32 సినిమా వార్ 2 అవుతుంది. అయితే వీటితోపాటు మళ్లీ రాజమౌళితో మరో సినిమా చేయబోతున్నట్టు కూడా ఫిలింనగర్లో టాక్ వినబడుతుంది. రాజమౌళి సినిమా కూడా మహేష్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు గనుక బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ పాస్టర్ గా నిలిస్తే ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో నెస్ట్ లెవెల్ లో ఉండటం పక్క..