అభిమానులకు తారక్ విన్నపం

0
13
Jr Ntr Request To Fans Regarding His Birth Day Celebrations

Jr NTR Birthday: రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు అభిమానులు సిద్దం అయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని చెప్పిన తారక్.. తాజాగా మరోసారి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు. ఈ మేరకు తన పుట్టినరోజు వేడుకలు ఎవ్వరూ చేయకూడదని విజ్ఞప్తి చేశారు.

సాధ్యం అయినంత వరకు ఎన్టీఆర్ పుట్టిన రోజును వైభవంగా జరుపుకోవాలని ఫ్యాన్స్ భావించారు. కాని ఎన్టీఆర్ మాత్రం అభిమానులకు ఈ సమయంలో వేడుకలు వద్దంటూ ఒక లేఖను విడుదల చేశాడు. మీరు జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబంను జాగ్రత్తగా చూసుకోండి అంటూ లేఖలో ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో తాను కరోనా నుండి కోలుకుంటున్నట్లుగా కూడా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన ఎన్టీఆర్.. తాను కరోనా బారిన పడ్డానని తెలిసి మీరు పంపిస్తున్న సందేశాలు చూస్తున్నానని, అవి తనకెంతో ఎనర్జీ ఇచ్చాయని అన్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని, త్వరలో కోవిడ్‌ని జయించి మీ ముందుకొస్తానని తెలిపారు. అయితే ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం కాదని చెప్పిన తారక్.. అంతా ఇంటిపట్టునే ఉంటూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తే అంతకన్నా మీరిచ్చే గొప్ప బహుమతి లేదని అన్నారు.

Read Also: Jr Ntr birthday: తారక్ బర్త్ డే నాడే NTR31 ప్రకటన ?

”మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని వైరస్‌తో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి మన సంఘీభావం తెలపాలి. ఎందరో జీవినోపాది కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీరు జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నా” అని తారక్ పేర్కొన్నారు.