తన పొలిటికల్ ఎంట్రీపై జానియర్ ఎన్టీఆర్ స్పందన

377
Jr NTR responds on his Political Entry at Evaru Meelo Koteeswarulu Press meet

రాజమౌళి డైరెక్షన్లో ఆర్.ఆర్.ఆర్ అనే బడా మల్టీ స్టారర్ మూవీ చేస్తూనే.. మరో పక్క జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోని హోస్ట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రోమో విడుదల సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందించారు.

ఈ సంద‌ర్భంగా ఓ జ‌ర్న‌లిస్ట్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఎప్పుడుంటుంద‌ని సూటిగా ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు మీరే స‌మాధానం చెప్పాల‌ని జ‌ర్న‌లిస్టుల‌కే చాయిస్ ఇచ్చారు. త‌మ‌కు తెలియ‌ద‌ని జ‌ర్న‌లిస్టులు స‌మాధానం ఇచ్చినా …ఆయ‌న విడిచిపెట్ట‌లేదు. త‌న నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చెప్పాల‌ని ఎన్టీఆర్ కోరారు. రాజకీయాల్లోకి ఇప్పట్లో రాబోనని… ఇది సమయం కాదన్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి మాట్లాడుకుందామన్నారు. వేడి వేడి కాఫీ తాగుతూ రాజకీయాలపై మాట్లాడుకుందామన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆర్.ఆర్.ఆర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినను పోయిరావలె హస్తినకు అనే చిత్రం చెయ్యబోతున్నాడు. అటు తరువాత కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా o చిత్రం చెయ్యబోతున్నాడు.