టాలీవుడ్ టాప్ హీరోగా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అసాధారణ అభిమానగణం ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్ద కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ పెరుగుతూనే వుంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత కేవలం ఫ్యాన్ వార్ లు.. సెలబ్రిటీల పై ట్రోలింగ్ మాత్రమే ఎక్కువైందనుకుంటే పొరపాటేనండోయ్. అవి మాత్రమే కాకుండా ఎంతో మంది క్రియేటర్స్ ను కూడా వెలుగులోకి తెస్తుంది సోషల్ మీడియా.
తాజా గా ఎన్టీఆర్ మెగా హీరో రామ్చరణ్ తో కలిసి `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశ లో వుంది. జక్కన్న ఆర్.ఆర్.ఆర్ ని ప్రకటించిన దగ్గరి నుంచి ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ల హడావుడి ఎక్కువైంది…ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు… ఎన్టీఆర్ నటించిన సినిమాల పేర్లతో.. ఎన్టీఆర్ ముఖ చిత్రం వచ్చేలా ఓ పిక్ చేసాడు. ఈ ఫోటో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెంకటగిరి నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఫేస్బుక్ వేదిక గా పోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఫొటోలు ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ‘ఎన్ని రోజులు కూర్చొని ఈ పిక్ చేసాడో కానీ ఆయన ఎడిటింగ్ సూపర్’ అంటూ ఆయన పై ప్రశంసలు కూడా కురుస్తున్నాయి.