jr ntr, samantha, kajal aggarwal starrer brindavanam completes 10 years in tfi

10 Years Of Brindavanam: Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR భారీ మల్టీ స్టారర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘బృందావనం’ అనే చిత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘‘సిటీ నుంచొచ్చాడు సాఫ్ట్‌గా లవర్ బోయ్‌లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చానుకో.. రచ్చరచ్చే’’.. ఈ డైలాగ్ 10 ఏళ్ల క్రితం ఓ సెన్సేషన్. ఎందుకంటే అప్పటి వరకూ మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ను ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యేలా చేసింది.

‘మున్నా’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి.. రెండో ప్రయత్నంగా ‘బృందావనం’ సినిమాను రూపొందించారు. 2010 అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదలయ్యింది. అంటే ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 10ఏళ్ళు పూర్తికావస్తోంది. కమర్షియల్ అంశాలతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి మరో మెట్టు పైకెక్కారు.

ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, ముఖేశ్ రుషి, తనికెళ్ల భరణి, వేణు మాధవ్, బ్రహ్మాజీ, ప్రగతి, హేమ, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, సన, సురేఖ వాణి.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కించారు. కాగా, ‘బృందావనం’ నేటితో 10 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు.