Jr NTR teaser coming soon from RRR movie

Jr NTR: RRR Update: దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతా అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే మే 20న జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డి అభిమానుల‌కు ఆర్ఆర్ఆర్ టీం నుంచి అదిరిపోయే ట్రీట్ అంది ఉండాల్సింది. అందుకోసం ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు వేసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌చ్చి అన్నింటినీ చెడ‌గొట్టేసింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసినప్పటికీ ఎన్టీఆర్ టీజర్ మాత్రం పెండింగ్ లోనే ఉంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఇది గమనించిన జక్కన్న ఈ నెలలో వారి కోరికను తీర్చబోతున్నాడు. ఐతే ఎట్ట‌కేల‌కు ఆర్ఆర్ఆర్ టీం చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.దసరా కానుకగా ఎన్టీఆర్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా ఎన్టీఆర్ ప్రోమోకు సంబంధించిన చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది.