‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ హోస్టుగా యంగ్ టైగర్

471
jr-ntr-to-host-a-show-called-evaru-meelo-koteeswarudu
jr-ntr-to-host-a-show-called-evaru-meelo-koteeswarudu

హీరోగా ఫుల్ బిజీగా ఉన్నా కూడా మరోసారి బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదివరకే బిగ్ బాస్ సీజన్ 1తో ఈయన హోస్టుగా మారాడు. ఆ షో బ్లాక్‌బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు జూనియర్. ఇన్నాళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి ఎవరు మీలో కోటీశ్వరుడు అనే టైటిల్ ఖరారు చేసారు.

ఈ ప్రోగ్రామ్‌తోనే మళ్లీ వస్తున్నాడు ఎన్టీఆర్. దీనికి హోస్టుగా చేయబోతున్నాడు యంగ్ టైగర్. అన్నపూర్ణ 7ఎకర్స్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా జరుగుతుంది. అందులో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోమోస్ షూట్ చేస్తున్నాడు. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది.

మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ను ఎవరు మీలో కోటీశ్వరుడు అని పేరు మార్చి తీసుకొస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్ నుంచి షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అంతా వేగంగా జరుగుతుంది.

ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరుగుతున్నా కూడా ఈషో కోసం కూడా కొన్ని డేట్స్ ఇచ్చాడు తారక్. ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా రోజుల కింద దీనిపై ఊహాగానాలు వచ్చాయి కానీ కరోనా కారణంగా షోపై అప్ డేట్స్ బయటికి రాలేదు.

ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ షోకు మెరుగులు దిద్దుతున్నారు నిర్వాహకులు. ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు.