‘ఉప్పెన’ ట్రైలర్ లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
330
jr-ntr-to-launch-uppena-trailer
jr-ntr-to-launch-uppena-trailer

యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.

 

 

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజరు సినిమాపై అంచనాలను పెంచాయి. దేవిశ్రీపసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ‘ఉప్పెన’ ట్రైలర్ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రబృందం. కాగా, ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పాజిటివ్ బజ్ తీసుకొచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ లాంచ్ చేయబోయే ట్రైలర్ తో మరిన్ని అంచనాలు ఏర్పడనున్నాయి.

Previous articleసాయితేజ్ ‘రిపబ్లిక్‌’ రిలీజ్ డేట్ ఖరారు
Next articleవిశ్వక్ సేన్ ‘పాగల్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్