Jr NTR Upcoming Movies With Top Directors After RRR Movie
Jr NTR Upcoming Movies With Top Directors After RRR Movie

RRR ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతున్నా కూడా ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.బాహుబలి తీసిన జక్కన్న డైరెక్షన్,స్టార్ హీరోస్ NTR అండ్ రాంచరణ్ ల ప్రజెన్స్ వల్ల ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఏర్పడింది.అయితే ఇంత భారీ సినిమా చేసిన తరువాత NTR ఎలాంటి సినిమా చేస్తాడు?,ఎవరితో చేస్తాడు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ థింగ్.

తన సినిమా త్రివిక్రమ్ తో ఉండొచ్చు అని ఎన్టీఆర్ చెప్పినా జరుగుతున్న మీటింగ్స్,వాటి సిట్యుయేషన్స్ మాత్రం వేరే రకంగా ఉన్నాయి.RRR ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి NTR తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ తో సినిమా అనే ఆలోచనలో ఉన్నాడు.ఒక్కసారి RRR బయటికి వచ్చాక ఆ నేషనల్ మార్కెట్ ని సస్టైన్ చెయ్యాలి అనే కోరిక కలగడం కామన్.ఇది గమనించే ముందు చూపుతో ఆలోచించే మైత్రి వాళ్ళు ఆల్రెడీ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని లాక్ చేశారు.ఇప్పుడు ఇదే ప్రోజెక్ట్ ని కళ్యాణ్ రామ్ టేకోవర్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు అని టాక్ ఉంది.కానీ మైత్రి వాళ్ళు కేవలం పార్టనర్ షిప్ తప్ప పూర్తిగా ఇచ్చే ఆలోచనలో లేరు అని ఇండస్ట్రీ గాసిప్.కానీ RRR తరువాత ప్రశాంత్ నీల్ సినిమా మంచి ఆప్షన్.RRR తో ఎన్టీఆర్ కి వచ్చే మార్కెట్ ని ఉపయోగించుకోవాలి అని కొరటాల ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్.అందుకే యూనివర్సల్ పాయింట్ తో కథ అల్లుకుంటున్నాడు అని టాక్.

కానీ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే టైం కి కొరటాల మెగాస్టార్ ప్రోజెక్ట్ పూర్తిచేయగలుగుతాడా? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.2019 ఎండింగ్ కి ఎన్టీఆర్ పోర్షన్ అయిపోతుంది అనుకున్నా కూడా ఇప్పటికి అయితే అది డౌట్.ఒక వేళ ఎన్టీఆర్ రిలీజ్ వరకు అందుబాటులో ఉండకపోతే త్రివిక్రమ్ అన్ని నెలలు తారక్ కోసం వెయిట్ చేస్తాడా అనేది కూడా ప్రస్తుతానికి వ్యాలీడ్ క్వశ్చన్.ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయంలో ప్రస్తుతానికి కన్ఫ్యూషన్ తప్ప క్లారిటీ మాత్రం లేదు.కానీ దిల్ రాజు,కళ్యాణ్ రామ్,మైత్రి మూవీ మేకర్స్,హారిక హాసిని,కొరటాల…ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.