Jr NTR role in war 2 movie: వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దేశం మొత్తం మూవీ లవర్స్ అలాగే ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ భారీ ప్రకటనతో, యష్ రాజ్ ఫిలిమ్స్ స్పైవర్స్ నుండి వార్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Jr NTR negative role in war 2 movie: ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 (NTR30) సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం 3 నెలల డేట్స్ కేటాయించాడు. వార్ 2(war 2 shooting) సినిమా డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రానికి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని యాష్ రాజ్ ఫిలిం మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2 సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్నా విలన్ (villain) పాత్రలో కనిపిస్తారంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. ఎన్టీఆర్ (NTR) మాస్ షేడ్స్ తో ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షిస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ యాక్షన్ చేసిన సినిమా జై లవకుశ.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ (villain) చేసిన పాత్రకి బాగానే ప్రశంసలు అందాయి. అందుకనే దర్శకుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని సినిమాలో కీలకమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ సూపర్ స్టార్‌లను కలిగి ఉన్న YRF స్పై యూనివర్స్‌కి వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రోల్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోయే రోజుల్లో తెలిసే అవకాశాలు చాలానే ఉన్నాయి. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
వీటితోపాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30, తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమాలు లైన్ లో పెట్టారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలు స్టోరీ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా బర్తడే సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Web Title: Jr NTR Playing Negative Role In Hrithik Roshan’s War 2, Jr NTR Villain role in war 2 movie, Jr NTR role revealed in War 2 movie, Jr NTR, NTR30, NTR30 First Look,NTR30 title, Birthday special posters, Jr NTR to play villain in sequel to Hrithik Roshan’s ‘War’