Jr NTR’s Birthday Special: జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. మరి ఈ సమయంలోనే తారక్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “RRR” నుంచి తాను చేస్తున్న కొమరం భీం సరికొత్త పోస్టర్ కోసం అయితే మరో స్థాయిలో ఎదురు చూస్తున్నారు.
కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఉగ్రరూపాన్ని రేపు చూడొచ్చని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అభిమానులు కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ పిలుపునిచ్చింది. వేడుకలు జరపుకునేందుకు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేసింది.
రాజమౌళి అప్పుడు చరణ్ నుంచి సీతారామరాజుగా ఊహించని మేకోవర్ లుక్ ను చూపించారు. మరి ఈసారి భీం గా ఎన్టీఆర్ ను ఎలాంటి అవతార్ లో చూపిస్తారో చూడాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 13న విడుదల చేయాలని చిత్రబృందం సంకల్పించినా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దసరా నాటికి ఈ చిత్రాన్ని తీసుకురావడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Unveiling @tarak9999 as INTENSE #KomaramBheem tomorrow, 10 AM. 🌊#RRRMovie.
We urge all fans to stay home, stay safe and not to come out to celebrate! #RRR @ssrajamouli @AlwaysRamCharan @AjayDevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies @RRRMovie pic.twitter.com/AxqokRHrYk
— RRR Movie (@RRRMovie) May 19, 2021