తేజ ‘చిత్రం’ సీక్వెల్ లో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది

316
Jr NTRs Brother in Law Narne Nithin Chandra to Debut with Tejas Chitram Sequal
Jr NTRs Brother in Law Narne Nithin Chandra to Debut with Tejas Chitram Sequal

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా పరిచయం అవటానికి రంగం సిద్ధం అయింది. అతడి పూర్తి పేరు నార్నే నితిన్ చంద్ర. తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి అతగాడు తమ్ముడు. హీరో కావటం కోసం నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నాడట.

 

 

ఇక ఇతగాడిని ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి హీరోల్ని పరిచయం చేసిన డైరెక్టర్ తేజ లాంచ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు తనయుడైన నితిన్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశం. అయితే నితిన్ ఎంట్రీ విషయంలో జూనియర్ సపోర్ట్ ఎంత వరకూ ఉంటుందనేదే తెలియరాలేదు.

 

 

నితిన్ ఎంట్రీ సినిమాకి చిత్రం 1.1 అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. తేజ ‘చిత్రం’ సినిమాకి ఇది సీక్వెల్ గా అని టాక్. హీరోతో పాటు 40 మంది కొత్త ఆర్టిస్టుల్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేయనుండటం విశేషం.