OTT News: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!

0
132
July 2021 Telugu Movies OTT Release Date, Schedule

OTT Movie News: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఎంట్రీ ఇవ్వనున్న సినిమాల గురించి, వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం. థియేటర్ల అనిశ్చితి ఇంకా కొనసాగుతుండటంతో సినిమాలన్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. భారీ చిత్రాలు సైతం అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ వంటి డిజిటల్‌ వేదికలను ఎంచుకుంటున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. 

Cold Case: ముందుగా ‘కోల్డ్‌ కేస్‌’ సినిమా. తను బాలక్‌ దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 30న రిలీజ్‌ కానుంది.

Haseen Dillruba: లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో జోరుమీదుంది తాప్సీ. మరోసారి అలాంటి చిత్రంతోనే  ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.  కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వచ్చిన ‘హసీన్‌ దిల్‌రూబా’ చివరకు ఓటీటీ బాట పట్టింది. జులై 2న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలవుతోంది.

Rashmika Pogaru: కన్నడ సినిమాలు  ‘యువరత్న’, ‘రాబర్ట్‌ ’, ‘పొగరు’ తెలుగులోకి అనువాదాలుగా ఈ  ఏడాదే విడులయ్యాయి. వీటిలో ధ్రువ్‌ సార్జా నటించిన ‘పొగరు’ ఆకట్టుకుంది. అయితే, ఎక్కువ థియేటర్‌లలో విడుదలకాకపోవడం, కరోనా పరిస్థితులు కారణంగా పెద్దగా టాక్‌ తెచ్చుకోలేదు. ఇప్పుడీ చిత్రం డిజిటల్‌ మీడియాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జులై 2న తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా విడుదలవుతోంది. 

the tomorrow war: అదే విధంగా ‘ద టుమారో వార్‌’ సినిమా. క్రిస్‌ మెకే దర్శకత్వంలో క్రిస్‌ ప్రాట్‌, వోనె స్ట్రాహోవ్‌స్కీ, జేకే సిమ్మన్స్‌, బెట్టీ గిల్పిన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది.

Loki: ఇప్పటికే ఇంగ్లీష్‌ విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ ‘లోకి: ది మిస్చీఫ్’‌. మార్వెల్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో కాస్త ఆలస్యంగా జూన్‌ 30న విడుదల కాబోతుంది.  ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్లు  విడుదలయ్యాయి. నాలుగో ఎపిసోడ్‌ జూన్‌ 30న విడుదలవుతోంది.

ఈ వారంలో రానున్న మరికొన్ని చిత్రాలు

Movie NameRelease dateOTT Platform
జూన్‌జూన్‌ 30ప్లానెట్‌ మరాఠీ
సోఫీజూన్‌ 30నెట్‌ఫ్లిక్స్‌
ప్రైమ్‌ టైమ్‌జూన్‌ 30నెట్‌ఫ్లిక్స్‌
సిండ్రెల్లా స్టోరీ: స్టార్‌ స్ట్రక్‌జూన్‌ 30బుక్‌ మై షో స్ట్రీమ్‌
నో సడెన్‌ మూవ్‌జులై 1హెచ్‌బీవో మాక్స్‌
జనరేషన్‌ 56కెజులై 1నెట్‌ఫ్లిక్స్‌
ది లాస్ట్‌ క్రూయిజ్‌జులై 1డిస్నీ హాట్ స్టార్‌
యంగ్‌ రాయల్స్‌జులై 1నెట్‌ఫ్లిక్స్‌
రేడియోయాక్టివ్‌జులై 2బుక్‌మై షో స్ట్రీమ్‌
ది టుమారో వార్‌జులై 2అమెజాన్‌ ప్రైమ్‌
30 రోజుల్లో ప్రేమించడం ఎలా?జులై 2ఆహా
వుయ్‌ ది పిపుల్‌జులై 3నెట్‌ఫ్లిక్స్‌