Jyotika, Revathy Jackpot Telugu Trailer Public Talk, Cast
Jyotika, Revathy Jackpot Telugu Trailer Public Talk, Cast

రేవతి,జ్యోతిక లీడ్ పెయిర్స్ గా తెరకెక్కిన సినిమా జాక్ పాట్.ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిన ఈ ఇద్దరితో సినిమా అంటే వినడానికి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.కానీ ఈ సినిమాని స్వయంగా సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు,అవుట్ అండ్ అవుట్ కామెడీ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది అనే విషయాలు తెలిస్తే మాత్రం ఈ సినిమాపై ఆసక్తి కలుగుతుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఈ సినిమా కూడా చూసి తీరాలి అనే ఫీలింగ్ కలుగుతుంది.డైరెక్టర్ కళ్యాణ్ జ్యోతికని,రేవతిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ తయారుచేసుకుని వాళ్ళని ఒపించడంతోనే అతను పాస్ అయిపోయాడు అనుకోవచ్చు.జ్యోతిక,రేవతి ఇద్దరూ కూడా కామెడీ పండించారు.కానీ ఫైట్స్ చేసే బాధ్యత మాత్రం జ్యోతిక తీసుకుంది.ఆమెకి ఇది ఫుల్ ప్లెడ్జెడ్ కమ్ బ్యాక్ గా మారే సినిమా అనిపించడంతో చాలా కష్టపడి నటించింది అని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

ఇక ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న కమెడియన్స్ రాజేంద్రన్,యోగిబాబు లకు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి.ఇక విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా సినిమాకి ఎస్సెట్ గా నిలిచేలా ఉంది.బడ్జెట్ పరంగా సూర్య ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అనిపిస్తుంది.వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై ఫుల్ పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేసింది ట్రైలర్.