హిందీలో హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్

Prakash Kovelamudi Who Hit In Bollywood With kangana ranaut
Prakash Kovelamudi Who Hit In Bollywood With kangana ranaut

తిరుగులేని విజయాలు అందుకుని దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు కె.రాఘవేంద్ర రావు.అయితే తథా,తండ్రి బాటలోనే మెగా ఫోన్ చేపట్టిన కోవెలమూడి ప్రకాష్ మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క హిట్ కూడా అందుకోలేదు.అనగనగా ఒక ధీరుడు,సైజ్ జీరో లాంటి భారీ డిజాస్టర్స్ ఇచ్చాడు.

కానీ బాలీవుడ్ లో కంగనా రనౌత్,రాజ్ కుమార్ రావు జంటగా ప్రకాష్ రూపొందించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమాకి మాత్రం పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.కంగనా,రాజ్ కుమార్ రావు ల నటనకే కాదు ప్రకాష్ డైరెక్షన్ కి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.టాలీవుడ్ లో సాధించలేనిది బాలీవుడ్ లో సాధించాడు.అది కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాకి కథ అందించింది కూడా ప్రకాష్ భార్య అయిన కనికా థిల్లాన్ కావడం విశేషం.