K Viswanath, Chiranjeevi Movie Aapadbandhavudu Completes 28 Years

28 Years For Aapadbandhavudu: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అద్భుతమైన చిత్రాల్లో ‘ఆపద్బాంధువుడు’ ఒకటి. ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’. ఈ చిత్రం అక్టోబర్‌ 9తో 28 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో ఈ చిత్రం మిస్ అయ్యింది.కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘ఆపద్బాంధువుడు’ కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రంలో చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది. మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అలాగే యం.యం. కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాగే ఎంఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి.

కె.విశ్వనాథ్‌ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల.. ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. కె.విశ్వనాథ్‌ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్‌ వేసుకున్నారు.