కబీర్ సింగ్…గత వారం రోజులుగా బాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ ఇదే.ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ అంటూ పొగిడేస్తున్నారు.ట్రేడ్ రిపోర్ట్స్ కూడా అదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.కానీ సౌత్ స్టోరీ అండ్ సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టడం ఇష్టంలేని కొంతమంది మాత్రం కబీర్ సింగ్ వేస్ట్ అంటున్నారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేవలం అయిదు రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టాడు సందీప్ రెడ్డి సృష్టించిన సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డ్రగ్ అడిక్ట్.అతనికి బాలీవుడ్ జనాలు కనెక్ట్ అయ్యి వీక్ డేస్ లో సైతం వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ ఏడాది సల్మాన్ ఖాన్ భారత్ నాలుగు రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది.కబీర్ సింగ్ దానికంటే ఒక రోజు లేట్ గా ఆ ఫీట్ అందుకుంది.కాకపోతే కబీర్ సింగ్ కంటే భారత్ దాదాపు 1500 ఏక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది అనేది ఇక్కడ వాలీడ్ పాయింట్.దాంతో 2019 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఉరి తరువాతి ప్లేస్ కబీర్ సింగ్ కి దక్కింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా ఉరి ని కూడా దాటేసే అవకాశాలున్నాయి.షాహిద్ కపూర్ కి కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్.ఈ సినిమాతో షాహిద్ సౌత్ సినిమాలకి,సౌత్ డైరెక్టర్స్ టాలెంట్ కి ఫిదా అయిపోయాడు.రీసెంట్ గా తెలుగులో సూపర్ సినిమా అని అందరి ప్రశంసలు అందుకున్న సినిమా జెర్సీ రైట్స్ ని ఫ్యాన్సీ అమౌంట్ కి బాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దక్కించుకున్నాడు.కబీర్ సింగ్ తో షాహిద్ బ్లాస్టింగ్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు జెర్సీ రీమేక్ కి కూడా అతనే ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాని ఒరిజినల్ వెర్షన్ ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి కే రీమేక్ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

కబీర్ సింగ్ సక్సెస్ కి కారణం ఆ సినిమాని సందీప్ డైరెక్ట్ చెయ్యడమే.అందుకే కబీర్ సింగ్ జెర్సీ ని వేసుకోవడం ఖాయం అయిపోయింది.ఇవ్వాళో రేపో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.

 

[INSERT_ELEMENTOR id=”3574″]