Kabzaa OTT Release Date: ఈమధ్య కన్నడ ఇండస్ట్రీ నుంచి మాస్ ఎంటర్టైనర్ మూవీస్ వరుసగా వస్తున్నాయి. వీటిలో గమనిస్తే కేజిఎఫ్ సిరీస్ తర్వాత అదే రేంజిలో ఉపేంద్ర నటించిన కబ్జా మూవీ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన కబ్జా మూవీ అనుకున్న స్థాయిలో ప్రజలు ఆదరించలేదు. అయితే ఈ కబ్జా మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైనట్టు తెలుస్తుంది.
Kabzaa OTT Release Date:కిచ్చా సుదీప్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించిన కబ్జా మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి సంస్థ వారు దక్కించుకున్నారు. దాదాపు 110 కోట్ల బడ్జెట్తో నిర్మించిన కబ్జా మూవీ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే అందరూ ఈ సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచి కేజిఎఫ్ కి పోల్చడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది.
ఇప్పుడు కబ్జా మూవీ విడుదలైన 25 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద రాణించ లేకపోయినా ఈ సినిమా ఏప్రిల్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అదే రోజు ఈ సినిమాని కన్నడంతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఈ సినిమాని విడుదల కాకముందు లే భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.