పుట్టబోయే బిడ్డ కోసం తప్పదు: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్స్ లో మంచి పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) కూడా ఒకటి. అటు హిందీ లోనూ ఇటు తెలుగులోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

పెద్ద హీరోలతో అందరితో నటించిన కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), గౌతమ్ కిచ్లు నీ నీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు కాజల్ ప్రెగ్నెన్సీని (Kajal Agarwal pregnant) అధికారికంగా ప్రకటించాడు.

కాజల్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత, తను చాలావరకు సినిమాలన్నీ వదిలేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్లో ఉన్న వాటిని కూడా తన పాత్రకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రెగ్నెన్సీ (Kajal Agarwal pregnant) సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవల తన బేబీ బంప్ తో కొన్ని ఫోటోలని కూడా షేర్ చేసింది కాజల్.

Kajal Aggarwal starts her Prenatal Journey
Kajal Aggarwal starts her Prenatal Journey

తాజాగా తను ప్రెగ్నెంట్ (Kajal Agarwal pregnant) ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆన్లైన్ లో ఫిజిక్ 57 ఇండియా అనే సంస్థ సాయంతో ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ ని చేస్తుంది. ఆన్లైన్ లో ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ నేర్చుకుంటున్న వీడియోని స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్. ఈ ఏడాది ఏప్రిల్ 1న ‘ఆచార్య’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Related Articles

Telugu Articles

Movie Articles