Kajal Aggarwal becomes first South Indian actress to get wax figure at Madame Tussauds in Singapore
Kajal Aggarwal becomes first South Indian actress to get wax figure at Madame Tussauds in Singapore

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ అమితానందంతో గాల్లో విహరిస్తోంది ఇప్పుడు. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కాజల్ అగర్వాల్. సాధారణంగా కాజల్ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఆనందంతో ఆ కళ్ళు మరింత పెద్దవిగా అయ్యాయి. తన ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చేయనున్నారు.

మ్యూజియం నిర్వాహకులు కాజల్ అగర్వాల్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. దక్షిణాది నుండి మహేష్ బాబుకు ఈ గౌరవం దక్కింది. సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన స్టాట్యూ పెట్టారు. అలాగే, అతిలోక సుందరి శ్రీదేవి స్టాట్యూ కూడా పెట్టారు. ఆమె స్టాట్యూ ఆవిష్కరణకు భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వి, ఖుషి ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. కాజల్ స్టాట్యూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తారీఖున ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన ప్యారిస్ ప్యారిస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆమె ముంబాయి సాగా, ‘ఇండియన్ 2’ మోసగాళ్లు వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.