Kajal Aggarwal , Belamkonda Sai Srinivas, Sita Movie, Tollywood News
Kajal Aggarwal , Belamkonda Sai Srinivas, Sita Movie, Tollywood News

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ,కాజల్ జంటగా నటిస్తున్న సీత సినిమా కంప్లీట్ అయిపొయింది.ముందు రెండు డేట్స్ ఇచ్చినా కూడా సినిమా రిలీజ్ కుదరలేదు.బజ్ లేకపోవడం దగ్గరినుండి బిజినెస్ వరకు అనేక రీజన్స్ ఉన్నాయి వాళ్ళ వాయిదాలు అనివార్యం అయ్యాయి.గతంలో కవచం సినిమాతో ఫెయిల్యూర్ అందుకున్న లీడ్ పెయిర్ ఈ సారి హిట్ కొట్టాలి అని చూస్తున్నారు.అది కాకుండా ఈ సినిమాలో పనిచేస్తున్న కీ మెంబెర్స్ అందరికి కూడా ఈ సినిమా విజయం కీలకంగా మారింది.ముఖ్యంగా ఇప్పటివరకు కమర్షియల్ గా ఒక్క సినిమాకి కూడా పెట్టినపెట్టుబడి రాబట్టలేకపోయిన హీరో బెల్లంకొండకి,ఎన్టీఆర్ బయోపిక్ వదులుకుని ఈ సినిమా టెక్ అప్ చేసినా తేజ కి,మహేష్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న అనీల్ సుంకరకి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

అందుకే పోటీలకు పోకుండా కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు.మహర్షి కి రెండు వారాలు గ్యాప్ ఇస్తూ సీత సినిమాని 24 కి రిలీజ్ చేస్తున్నారు.కాకపోతే అప్పటికి మహర్షి జోరు తగ్గినా అర్జున్ సురవరం,ABCD హిట్ అయితే మాత్రం సీత కి టాప్ కాంపిటేషన్ ఉంటుంది.లేదంటే మాత్రం పరవాలేదు అనిపించుకున్నా కూడా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేస్తుంది.సమ్మర్ సీజన్ అనే బోనస్ సీత కి కాస్త ఎక్స్ట్రా ఎడ్జ్ ఇస్తుంది.మరి ఈ పరీక్షలో సీత ఎలానెగ్గుతుందో చూడాలి.