నాగార్జున – ప్రవీణ్‌ సత్తారు సినిమాలో కాజల్ అగర్వాల్

418
Kajal Aggarwal Confirm Nagarjuna Praveen Sattaru Movie
Kajal Aggarwal Confirm Nagarjuna Praveen Sattaru Movie

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా, ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుతో మరో సినిమా మొదలుపెట్టాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ పాత్రలో నటించనున్నాడు.

 

 

నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. మార్చి 31 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. తాజాగా నాగ్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ ఖరారు అయింది.

 

 

టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించిన కాజల్, నాగార్జునతో మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ఈ సినిమాలో తొలిసారి కాజల్‌ నాగార్జునకు జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం కాజల్ ‘మోసగాళ్ళు’ సినిమాలో విష్ణుకు సోదరిగా నటించింది.

 

 

ఈ నెల 19న విడుదల కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా మే 13న విడుదల కానుంది. ఇక నాగార్జునతో మూవీ ఈ యేడాది చివరిలో రానుందని తెలుస్తోంది.