Homeసినిమా వార్తలు#NBK108 షూటింగ్‌లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్

#NBK108 షూటింగ్‌లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్

Kajal Aggarwal confirmed lead heroine for NBK108.. Nandamuri Balakrishna and Anil Ravipudi next NBK108 heroine confirmed.. Kajal romance with Balakrishna in NBK108

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ శ్రీలీల చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది. ఏజ్ లెస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈరోజు ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌లో జాయిన్ అయింది.

బాలకృష్ణతో కాజల్ నటిస్తున్న మొదటి చిత్రం NBK108 కావడం విశేషం. బాలకృష్ణ, కాజల్ ఒకరిని నొకరు పిడికిలితో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. #NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.

Kajal Aggarwal confirmed lead heroine for NBK108

#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ #NBK108కి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వుంది.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY