ఒక్కపైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్..!

0
589
kajal aggarwal enjoyed honeymoon in maldives without spending single paisa

సెలబ్రెటీలు సెకనుకి లక్ష అయినా పే చేయగలరు.. వారి సంపాదన కోట్లలో ఉంటే ఆ మాత్రం ఖర్చుపెట్టలేరా ఏంటి.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ఓ పోస్టో, ఓ ఫోటోనో పెట్టి ఫాలోవర్స్ సంఖ్యని పెంచుకుంటే డబ్బులు అకౌంట్‌లో అమాంతం వచ్చి పడుతుంటాయి. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లింది. మాల్దీవుల్లో కాజల్ హనీమూన్‌ను ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇప్పటికే అంతా సోషల్ మీడియాలో చూశారు.

ప్రపంచంలోనే మొట్టమొదట నీటి అడుగున ఉన్న ది మురాకా హోటల్ అక్కడ ఉంది. అందులోనే ఈ జంట పది రోజులపాటు బస చేశారు. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది కాజల్. ఆ గాజు గదిలో నుంచి కొన్ని వేల అందమైన చేపలు ఈదుకుంటే వెళ్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. మరి ఇంత అందమైన అనుభూతిని ఇచ్చే హోటల్‌కు అద్దె కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా!

అయితే పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ హోటల్‌లో బస చేయాలంటే ఒక్క రాత్రికి దాదాపు రూ.38 లక్షలు ఖర్చవుతాయట. బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ హోటల్‌లో కాజల్ అగర్వాల్ జంట 10 రోజులు స్టే చేసింది. దీంతో హోటల్ అద్దె, ఆహారం, ఇతర సైట్‌సీయింగ్ ఖర్చులతో కలుపుకుని మొత్తం మీద కాజల్‌కు అయిన ఖర్చు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. అయితే, ఈ ఐదు కోట్ల రూపాయలను కాజల్ జంట హోటల్‌కు చెల్లించలేదట.

 

తమ పర్యాటక రంగాన్ని విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు చేరువచేయాలనే ఉద్దేశంతో మాల్దీవుల ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇండియాలో ప్రమోట్ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నడుం బిగించిందట. అందులో భాగంగానే ఏ సెలబ్రెటీకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్లు మాల్దీవులకు వచ్చినప్పుడు ఏ హోటల్‌లో బస చేస్తే అక్కడ ఫైవ్‌స్టార్ భోజనం ఉచితంగా అందిస్తారు. అదే అయిదు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలకైతే ఆ హోటల్‌లో రూమ్, ఫుడ్, రిటన్ టిక్కెట్లు అన్నీ ఫ్రీ.. ఇక కాజల్‌కి 16 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకెందుకు తీసుకుంటారు డబ్బులు.

అయితే, ఈ ఉచితం కోసం సెలబ్రిటీలు చేయాల్సిందల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫొటోలు పోస్ట్ చేసి మాల్దీవులు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడమే. ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి మేడమ్ అంటూ సాదరంగా స్వాగతం పలికి అతిధి సత్కారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అమ్మడికి పైసా ఖర్చు లేకుండా చేసిన అభిమానులు గ్రేట్. ఈ క్రెడిట్ అంతా వారిదే మరి. కాజల్ పెళ్లి చేసుకుందని తెలియగానే మురాకా హోటల్ యాజమాన్యమే ఆమెకు స్వయంగా ఫోన్ చేసి మా హోటల్ సందర్శించండి అంటూ ఫ్రీ ప్యాకేజ్ గురించి వివరించారట. దీనిలో నిజమెంతో తెలియాలి అంటే కాజల్ స్పందించాలి.

Previous articlePics: Ram Charan, Allu Arjun head off to Udaipur For Niharika Marriage
Next articleKGF Chapter 2: Yash and Sanjay Dutt shoot for KGF climax in Hyderabad