`ఆచార్య` సెట్లో కాజల్ కిచ్లు జంట

0
443
Kajal Aggarwal Enters Her Latest Project Acharya Sets With Gautam Kitchlu

ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటిదైన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తిరిగి సెట్స్‌పై చేరిపోయింది. అక్టోబర్ 30న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ లో వెడ్డింగ్ అనంతరం ఈ కొత్త జంట మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లారు. కొన్ని రోజులపాటు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ, ఏకంగా తన భర్త గౌత‌మ్ కిచ్లూని తీసుకొని నేటి ఉదయం తన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ సెట్స్‌కి వచ్చింది. నవ దంపతులను చూసి ఎంతో మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని సెట్లో మెగాస్టార్ చిరంజీవి .. కాజల్ అగర్వాల్ సహా కీలక నటీనటులపై శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఇందుకోసం కాజ‌ల్ తన భ‌ర్తతో సహా ఆచార్య సెట్స్‌కి విచ్చేసి చిత్ర‌ బృందాన్ని స‌ర్‌ప్రైజ్ చేసింది. దీంతో కాజ‌ల్- గౌతమ్ జంట‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో దండ‌లు మార్పించి కేక్ కట్ చేయించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో ఎస్. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ‘ఆచార్య’ మూవీ రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. చిరంజీవి 152వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

 

Previous articleమహేష్, త్రివిక్రమ్ ల కాంబో మళ్లీ వస్తుందా ?
Next articleఅరవింద్ రామాయణం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్ర‌మ్‌..?