Kajal Aggarwal And Gautam Kitchlu Are Honeymoon In Maldives

Kajal Aggarwal : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె వివాహమాడారు.  అక్టోబర్ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  ముంబయిలో అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన వీరి పెళ్లి వేడుక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. పెళ్లికి ముందు నుండి పెళ్లి తర్వాత గృహ ప్రవేశం పూజా ఆ తర్వాత వారిద్దరి ఫొటో షూట్ ఇలా అన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Kajal Aggarwal Gautam Honeymoon Photos and images

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు మాల్దీవులులో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అక్కడ సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్న ఫొటలను ఎప్పటిలాగే షేర్ చేస్తున్నారు. అందమైన కాజల్ రెడ్ డ్రస్ లో క్యాప్ పెట్టుకుని బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని వావ్ అన్నట్లుగా ఉంది.  సముద్రం ఒడ్డున నిలబడి కాజల్ తీసుకున్న ఈ ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా మాల్దీవులు ప్రకృతి అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి.

కొన్‌రాడ్ మాల్దీవ్స్ రంగలి ఐల్యాండ్‌లో ఉన్న లగ్జరీ రిసార్ట్స్‌లో ప్రస్తుతం కాజల్, గౌతమ్ కిచ్లు ఉన్నారు. వారం రోజుల తర్వాత ఈ కొత్త దంపతులు ఇండియా తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే ఆచార్య సినిమా షూటింగ్ లో కాజల్ పాల్గొనబోతుంది. ఈ సినిమాతో పాటు ‘మోసగాళ్ళు’, ‘ఇండియన్ 2’, ‘ముంబై సాగ’ చిత్రాల్లో కాజల్ నటిస్తున్నారు.

Kajal Aggarwal Goutham Honymoon Photos and images Kajal Aggarwal Goutham Honymoon Photos and images Kajal Aggarwal Goutham Honymoon Photos and images Kajal Aggarwal Goutham Honymoon Photos and images