Kajal Aggarwal Next Film With Teja Direction Again, Latest Updates
Kajal Aggarwal Next Film With Teja Direction Again, Latest Updates
Kajal Aggarwal Next Film With Teja Direction Again, Latest Updates
Kajal Aggarwal Next Film With Teja Direction Again, Latest Updates

 

డైరెక్టర్ తేజ ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ కొట్టిన డైరెక్టర్ కానీ ఇప్పుడు మాత్రం అవుట్ ఆఫ్ ఫామ్ తో బాధ పడుతున్నాడు.మధ్యలో నేనే రాజు…నేనే మంత్రి తో హిట్ అందుకున్నా మళ్ళీ సీత తో డిజాస్టర్ టచ్ చేసాడు.అయితే ఆ హిట్ సినిమాలోనూ,ప్లాప్ సినిమాలోనూ హీరోయిన్ మాత్రం కాజల్.లక్ష్మికళ్యాణం సినిమాతో కాజల్ ని టాలీవుడ్ కి పరిచయం చేసాడు తేజ.అందుకే తేజ ఎప్పుడు అడిగినా సినిమా చేస్తుంది.

అయితే సీత సినిమా మాత్రం స్వయంగా కాజలే తేజ ని అడిగి మరీ చేసింది.సీత సినిమా మామూలు డిజాస్టర్ కాదు.తేజ బ్యాక్ టు ఫామ్ అంటూ సెటైర్స్ కూడా పడ్డాయి.అయినా కూడా కాజల్ కి తేజ క్యాలిబర్ మీద ఉన్న నమ్మకం కొంచెం కూడా తగ్గలేదు.సీత కథ ఫెయిల్ అయ్యింది కానీ తేజ ఫెయిల్ కాలేదు అన్న నమ్మకంతో ఉంది.అందుకే మళ్ళీ తేజ తో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చెయ్యడానికి రెడీ అయ్యింది.అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాకి కాజల్ ప్రొడ్యూసర్ కూడా.

ఇప్పటివరకు కేవలం హీరోయిన్ గా నటించిన కాజల్ ఇకనుండి నిర్మాతగా మారి సినిమాలు తియ్యాలని డిసైడ్ అయ్యింది.అందుకే ప్రొడ్యూసర్ గా తన మొదటి సినిమా చేసే అవకాశం తేజ కి ఇచ్చింది.ఆ సినిమాలో ఎలాంటి కథ ఉంటుందో,ఏ మాత్రం కథ ఉంటుందో తెలియదు గానీ కథాచర్చలు పూర్తయ్యాయి అని టాక్.ఒకప్పుడు తనకు అవకాశం ఇచ్చాడని డైరెక్టర్ ని గుర్తు పెట్టుకుని,అతని పొజిషన్ ని కూడా పట్టించుకోకుండా రివర్స్ లో అతనికే అవకాశం ఇచ్చి కృతజ్నత అంటే అర్ధం ఏంటి అనేది ప్రాక్టికల్ గా చూపించింది కాజల్.ఈ నిర్ణయంతో కాజల్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అని పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.