Kajal Aggarwal Opens About Her Love Story

Kajal aggarwal Love Story: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే అక్టోబర్ 30వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కొద్దిమంది సన్నిహితులే ఈ వివాహానికి హాజరయ్యారు. వివాహ అనంతరం తమ కొత్త ఇంట్లో కాపురం పెట్టారు ఈ నవదంపతులు. అయితే కాజల్ పెళ్లి అయ్యేంత వరకు కూడా ఈమె ప్రేమకథ గురించి ఎవరికీ ఐడియా లేదు. నిజానికి కాజల్ ప్రేమలో ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అప్పటికప్పుడు పెళ్లంటే పెద్దలు కుదిర్చిందనే అంతా అనుకున్నారు కానీ పదేళ్లుగా ఈమె ప్రేమలోనే ఉందనే విషయమే ఆశ్చర్యం అందరికీ.

తాజాగా కాజల్ తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఓపెన్ అయింది కాజల్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా దాదాపు పదేళ్ల క్రితం కలిశాం. ఆ తర్వాత మంచి స్నేహితులుగా ఏడేళ్ల పాటు రిలేషన్‌షిప్ కొనసాగించాం. వీలు కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండేవాళ్ళం. అలా అలా ఒకరిపై ఒకరం ఇష్టం పెంచుకొని మూడేళ్ల పాటు డేటింగ్‌ చేశాం. అయితే లాక్‌డౌన్ సమయంలో పెద్దగా కలవడం చాలా కష్టంగా మారడంతో మాస్కులు వేసుకుని కిరాణా స్టోర్స్ వద్ద కలుసుకునే వాళ్లం. ఒకరి జీవితంలో మరొకరు ఎంత ముఖ్యమనేది అప్పుడే అర్ధమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.. అని కాజల్ చెప్పింది.

బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ కిచ్లు బిజీగా ఉంటూనే కాజల్ మనసును కూడా దోచేసాడన్నమాట. అలా పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల స్నేహం.. మూడేళ్ల డేటింగ్ ఇప్పుడు జీవితకాల బంధం అయిపోయిందని చెప్పింది కాజల్. ప్రస్తుతం సినిమాల పరంగా చూసుకుంటే చిరంజీవి ఆచార్యతో పాటు కమల్ భారతీయుడు 2.. మంచు విష్ణు మోసగాళ్లు సినిమాల్లో నటిస్తుంది.