ఆ సినిమాలో కాజల్ కనిపించేది కొద్దిసేపేనా

0
238
Kajal Aggarwal role in prabhas upcoming Jaanu movie
Kajal Aggarwal role in prabhas upcoming Jaanu movie

ప్రభాస్-కాజల్.. ఈ జోడీ గతంలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో నటించారు. ప్రభాస్ కమర్షియల్ సినిమాల్లో నటించి ఉండి ఉంటే.. ఈ కాంబినేషన్ మరికొన్ని సినిమాల్లో రిపీట్ అయ్యి ఉండేది. బాహుబలి-1,2 సినిమాల సమయంలో మాస్ సినిమాలు ప్రభాస్ ఓ ఆరు-ఏడైనా చేసే వాడే..! కానీ దేశం గర్వించదగ్గ నటుడయ్యాడు. దక్షిణాదికి రారాజుగా నిలిచాడు. ప్లాప్ టాక్ తోనే సాహో ఆ స్థాయి కలెక్షన్లు సాధించిందంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం మరో క్రేజీ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ‘జాన్’ సినిమా.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతిథి పాత్రలో కాజల్ కనిపించనుందని అంటున్నారు. కాజల్ గతంలో చాలా సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించింది.. రణరంగం సినిమాలో కూడా కాజల్ నిడివి చాలా చిన్నదే.. అయినా కూడా సినిమా మీద ఇష్టంతో నటించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు కాజల్. అందుకే ప్రభాస్ సినిమాలో కూడా అతిథి పాత్రకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాజల్-ప్రభాస్ లను వెండితెరపై చూడాలని అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. దశాబ్ద కాలంగా దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. దక్షిణాదిన అందరు టాప్ హీరోలతో నటించింది. ప్రస్తుతం కాజల్ చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here