కాజల్ పాత్ర గురించి కొరటాల శివ సంచలన ప్రకటన..!!

చిరంజీవి అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా గురించి మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చివరికి ఈ సినిమాని ఈనెల 29న విడుదల చేయుటకు సిద్ధం చేశారు. ప్రమోషన్ లో భాగంగా విడుదలైన ట్రైలర్లు అలాగే టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచాయి. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర గురించి కొరటాల శివ సంచలన ప్రకటన చేశారు.

Kajal Aggarwal role removed from chiranjeevi Acharya
Kajal Aggarwal role removed from chiranjeevi Acharya

ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య డైరెక్టర్ అయినా కొరటాల శివ కాజల్ అగర్వాల్ పాత్ర గురించి చెప్పటం జరిగింది. ” మొదట్లో మేము ఆచార్య కథ గురించి చర్చిస్తున్నప్పుడు, చిరంజీవి గారు పోషించే కథానాయకుడు ఆచార్యపై రొమాంటిక్ ఆసక్తిని కలిగి ఉండాలని అనుకున్నాను.

ఫస్ట్ షూటింగ్ షెడ్యూలు కంప్లీట్ అవగానే దానికి సంబంధించిన అవుట్ అండ్ అవుట్ చూడటం జరిగింది. అయితే తనకు సంతృప్తిగా అనిపించలేదని చెప్పారు. కాజల్‌కి పాటలు లేవు. ఆమె పాత్రకు కూడా లాజికల్ ముగింపు లేదు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పూరించడానికి, ఒక హీరోయిన్‌ని కలిగి ఉండటం మరియు పాత్రను పోషించడానికి ఒక ప్రధాన నటిని ఎంపిక చేసుకోవడం తెలివైన ఎంపిక కాదని కొరటాల శివ భావించారట.

Here is why Kajal Aggarwal's character was removed from Chiranjeevi’s Acharya
Here is why Kajal Aggarwal’s character was removed from Chiranjeevi’s Acharya

అలాగే ఈ విషయాన్ని చిరంజీవి గారితో వివరించగా, చిరంజీవి గారు కూడా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అదే చేయండి అని చెప్పటంతో డైరెక్టర్ కొరటాల శివ ఈ విషయాన్ని కాజల్ తో షేర్ చేసుకోవడం జరిగిందట. కాజల్ కూడా వెంటనే అభిప్రాయాన్ని అంగీకరించి సినిమా నుండి తప్పుకోవడం జరిగిందని కొరటాల శివ వివరించారు.

ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ ‘లహే లహే’ పాటలో అతిథి పాత్రలో కనిపిస్తుందా లేదా అనేది ఖచ్చితంగా తెలియలేదు. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ తరవాత గానీ తెలియదు. అయితే దీనిపై హీరోయిన్ కాజల్ ఇంత వరకూ ఎటువంటి కామెంట్ చేయలేదు.

 

Web Title: kajal aggarwal role removed from Acharya movie, Kajal Aggarwal role removed from chiranjeevi Acharya, Here is why Kajal Aggarwal’s character was removed from Chiranjeevi’s Acharya

Related Articles

Telugu Articles

Movie Articles