Kajal Aggarwal to romance with Akkineni Nagarjun her next movie-min
Kajal Aggarwal to romance with Akkineni Nagarjun her next movie-min

నాగార్జున.. ఒకప్పుడు ప్లాప్ లు అంటేనే ఎరుగని హీరో..! తన కుమారులను కూడా టాలీవుడ్ హీరోలుగా చేసి.. కాస్త స్పీడ్ తగ్గించాడు. నాగ చైతన్య హీరోగా నిలదొక్కుకున్నప్పటికీ.. అఖిల్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు నాగార్జున. ఇక తన సినిమాల పరంగా వస్తే చివరి హిట్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ద్వారా అందుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన ఆఫీసర్ సినిమాను జనాలు చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇక మన్మథుడు-2 ను అయితే ఎందుకు చేశాడా నాగార్జున ఈ సినిమా అన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఇక ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు యువసామ్రాట్. మంచి కథ తీసుకొని వస్తే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో నాగార్జున ఎప్పుడూ ముందు ఉంటాడు. ఇప్పుడు కూడా సాల్మన్ అనే యువ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి రెఢీ అయిపోయాడు.

ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరా అని కొంత కన్ఫ్యూజన్ లో పడింది.. చిత్ర టీమ్..! ఎట్టకేలకు కాజల్ కు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఆమెను సంప్రదించగా.. ఓకె చెప్పేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాజల్ నాగచైతన్యతో ‘దడ’ అనే సినిమాలో నటించింది. ఇప్పుడు నాగచైతన్య తండ్రి నాగార్జునతో చేయడానికి ముందుకు వచ్చింది. మెగా ఫ్యామిలీతో హిట్స్ అందుకున్న కాజల్.. అక్కినేని ఫ్యామిలీతో హిట్ అందుకుంటుందా లేదా అన్నది కూడా తెలియాలి. ఇక కాజల్ ఇండస్ట్రీ లోకి వచ్చి దశాబ్దం పైగానే కావస్తోంది. ఇప్పటి దాకా నాగార్జునతో జోడీ కట్టే అవకాశం రాలేదు. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూ.. మరోవైపు యంగ్ హీరోలతో కూడా నటిస్తూ దూసుకుపోతోంది కాజల్ కెరీర్. త్వరలోనే కాజల్ పెళ్లి చేసుకోబోతోంది అని కూడా కామెంట్లు వినిపించాయి.. ఇప్పుడు కాజల్ చేతిలో నాలుగు పైగా సినిమాలు ఉన్నాయి.. ఇవి పూర్తయ్యాక అమ్మడు పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉండవచ్చు.