Anand Devarakonda, Shivathmika , Kallallo Kala Varamai Full Lyrical, Dorasaani
Anand Devarakonda, Shivathmika , Kallallo Kala Varamai Full Lyrical, Dorasaani

జీవిత రాజశేఖర్ ల రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమవుతూ టైటిల్ లో నటిస్తున్న సినిమా దొరసాని.ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ తమ్మడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా పరిచయమవుతున్నాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ఇదొక ఫీల్ ఓరియెంటెడ్ అండ్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని రివీల్ చేసాయి.వాటికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇప్పుడు ఆ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేసారు.’కళ్ళలో కలవరమై’ అంటూ సాగే ఈ పాట సినిమాకి సూపర్ మైలేజ్ తెస్తుంది అనడంలో నో డౌట్.ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పటికే చాలామంది రిపీట్ మోడ్ లో పెట్టుకుని వింటున్న ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.ప్రశాంత్.ఆర్.విహారి సోల్ ఫుల్ ట్యూన్,శ్రేష్ఠ బ్యూటీఫుల్ లిరిక్ కి చిన్మయి శ్రీపాద మ్యాజికల్ మెలోడియస్ వాయిస్ తోడవ్వడంతో ఒక్కసారి వినగానే కనెక్ట్ అయిపోతుంది.ఇక లిరికల్ వీడియో లో ఉన్న స్టిల్స్ చూస్తుంటే ఇది సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు అనిపిస్తుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

విజయ్ దేవరకొండ కి గీతగోవిందం లో ‘ఇంకేం ఇంకేం కావాలే’ సాంగ్ లా అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కి ‘కళ్ళలో కలవరమై’ పాట కూడా మైల్ స్టోన్ గా నిలిచేలా ఉంది.ఆనంద్ దేవరకొండ లాంచింగ్ అదిరిపోవాలి అని ఇప్పటనుండే ఏర్పాట్లు చేసుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ కి ఇది సూపర్ పాజిటివ్ వైబ్ అని చెప్పుకోవచ్చు.

[INSERT_ELEMENTOR id=”3574″]