Kalyan Dev Launches His Next film With Aswathama Director

Kalyan Dev: విజేత సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ముచ్చటగా తన మూడో సినిమా స్టార్ట్ చేసేశారు. కొత్త దర్శకుడు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్ళూరి ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించ‌నున్నారు. కళ్యాణ్ దేవ్ ఇటీవల సూపర్ మచ్చి సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత సరైన సమయంలో విడుదల చేయాలని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.

హైదరాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని తుల‌సివ‌నం శ్రీవెంక‌టేశ్వ‌ర దైవ స‌న్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి వెంకీ కుడుముల, యువ ద‌ర్శ‌కులు ప్ర‌ణీత్, వేణు ఉడుగ‌ల ముఖ్య అతిధులుగా విచ్చేసి, చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. అశ్వధామ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రమణ తేజ ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కు కమర్షియల్ సక్సెస్ ను ఇవ్వబోతున్నాడు అంటున్నారు.

ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందించనున్నారు. ”ఛ‌లో, భీష్మ” వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతం అందించిన మ‌హ‌తి సాగ‌ర్ బాణీలు కట్టనున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 14న టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నాం అంటూ నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకు తీసుకురానున్నారు మేకర్స్.