Kalyan Ram, 118 Movie Review, Tollywood Movie Reviews
Kalyan Ram, 118 Movie Review, Tollywood Movie Reviews

విడుదల తేదీ : మార్చి 01, 2019
రేటింగ్ : 2.5/5
నటీనటులు : కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే
దర్శకత్వం : కే వి గుహన్
నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫర్ : కే వి గుహన్
ఎడిటర్ : తమ్మిరాజు

కళ్యాణ్ రామ్ సినిమా అంటే రొటీన్ రివేంజ్ డ్రామా అనే భావన ప్రేక్షకుల్లో ఉంది.కానీ పటాస్ నుండి కూడా రకరకాల వేరియేషన్స్ ఉన్న కథలు ఎంచుకుంటూ ఇప్పుడిప్పుడే సరయిన ట్రాక్ లోకి వస్తున్నాడు.అందుకే కళ్యాణ్ రామ్ చేసిన థ్రిల్లర్ మూవీ 118 పై క్యూరియాసిటీ ఏర్పడింది.ఈ సారి కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా అలరిస్తాడు అనే హింట్స్ ఇచ్చింది 118 ట్రైలర్.దాంతో ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది,లుక్ గ్రాండ్ గా ఉంది,ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది.ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించిన ఈ సినిమా అదే అనుభూతిని అందించిందా?,కళ్యాణ్ రామ్ కి విజయం దక్కిందా లేదా అనేది ఇప్పడు చూద్దాం.

కథ:

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన గౌతమ్ కి ఒక రిసార్ట్ లో ఉన్నపుడు ఒక కల వస్తుంది.ఆ కలలో ఎవరో ఒక అమ్మాయిని కొంతమంది కొడుతున్నట్టు,ఒక లోయలో ఒక కార్ ని తోస్తున్నట్టు కనిపిస్తుంది.ఆ రిసార్ట్ లో రెండు సార్లు ఉంటే రెండు సార్లు కూడా అదే కల వస్తుంది.దాంతో అసలు తనకే ఆ కల ఎందుకు వచ్చింది?,ఆ కలలో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు? అనే ఎంక్వైరీ మొదలుపెడతాడు.ఆ అమ్మాయి పేరు ఆధ్య అని కనిపెడతాడు.అప్పటి నుండి అతనిపై అటాక్స్ జరగడం మొదలవుతుంది.ఈలోగా గౌతమ్ ఎస్తర్ అనే అమ్మాయి ద్వారా ఆధ్య కి సంబందించిన కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అసలు ఆధ్య ఎవరు?,గౌతమ్ కి ఆమె ఎందుకు కలలో కనిపించింది?,ఆమె ఏమయ్యింది?,గౌతమ్ ఆధ్య గతం గురించి ఎలా తెలుసుకున్నాడు?,తెలుస్కుకున్న తరువాత ఏం చేసాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

118 అని టైటిల్ పెట్టి సినిమా చూడాలనిపించేలా చేసిన డైరెక్టర్ ఫస్ట్ సీన్ లోనే ఆ సీక్రెట్ రివీల్ చేసాడు.పైగా అది అంత కన్వీన్సింగ్ గా కూడా లేదు.అలాగే ఉన్న చిన్నకథలో చాలా చెప్పాలనే ఆలోచన మంచిదే కాకపోతే ఆ క్రమంలో ఎన్నో ప్రసంగాలకు ఆన్సర్స్ ఇవ్వడం మర్చిపోయారు.ఇక కథను అనేక ఏరియాల్లో తిప్పుతూ,అనేకమంది విలన్స్ ని చూపిస్తూ,సినిమాకి ఆకర్షణ అయిన మెయిన్ ప్లాట్ ని రివీల్ చేసే విధానంలో మాత్రం ఆకట్టుకోలేకపోయారు.

చాలా చోట్ల కన్వెనియంట్ స్క్రీన్ ప్లే కి వెళ్లడం నిరుత్సాహ పరుస్తుంది.ఇక థ్రిల్ మూవీ లో ఎక్కడా ట్విస్టులు రివీల్ అవ్వకుండా,అదే టైం లో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోకుండా చూసుకోవాలి.కానీ ఈ సినిమాలో ప్రేక్షకులకంటే ఎక్కువగా పాత్రలు హైరానా పడిపోతాయి.అది కాస్త సిల్లీ గా అనిపిస్తుంది.కానీ ఈ సినిమాలో దయ్యం లాంటి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ టచ్ చేయకపోవడాన్ని మాత్రం మెచ్చుకోవాలి.ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు గాని,కథలో ఉన్నపాత్రలకు కానీ కనెక్ట్ కాకపోవడం సినిమా ఫలితాన్ని శాసించదగ్గ మైనస్ పాయింట్.

నటీనటులు:

డిఫరెంట్ సినిమాలు చెయ్యాలని ఫిక్స్ అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కొత్త పాత్రే చేసాడు.అతని స్టైలింగ్ కూడా చాలా బావుంది.అయితే థ్రిల్లర్ సినిమాలకి నటీనటుల హావభావాలు ప్రాణం.అయితే థ్రిల్ మోడ్ ని పండించే క్రమంలో ఎక్కువ చోట్ల ఒకే తరహా ఎక్స్ప్రెషన్స్ ని రిపీట్ చేసాడు.కంగారుగా డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా కొన్ని డైలాగ్స్ రోల్ అయిపోయాయి.అవి మినహాయిస్తే కళ్యాణ్ రామ్ పై పెద్దగా కంప్లైంట్స్ లేవు.

ఈ సినిమాకు అతను చాలా కష్టపడ్డాడు అని అర్ధమవుతుంది.ఇప్పటికే టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకున్న నివేత థామస్ కి ఈ సినిమా లో కీ రోల్ దక్కింది.ఆమె చుట్టూనే మెయిన్ పాయింట్ తిరుగుతూ ఉంటుంది.కానీ ఆ పాత్రలో ఆమెని ఛాలెంజ్ చేసేంత స్టఫ్ లేదు.ఆమె చెయ్యడం వల్లే ఆ పాత్ర ఒక మోస్తరుగా అనిపించింది.ఈ సినిమా పరంగా ఆమెకి పేరు పెట్టడానికి లేదు.షాలిని పాండే కి ఈ సినిమాలో చాలా లిమిటెడ్ రోల్ దక్కింది.ఒక పాట,కొన్ని సీన్స్ లో మాత్రమే ఆమె కనిపించింది.నటనకు స్కోప్ లేకపోవడంతో లుక్స్ పరంగా మెప్పించింది.ప్రభాస్ శ్రీను,హరితేజ,నాసర్,శ్రవణ్,భరత్ రెడ్డి తదతరులు డైరెక్టర్ చెప్పినట్టుగా చేసుకుంటూ పోయారు.

టెక్నీషియన్స్:

దూకుడు,బాద్షా,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,అతడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహించిన గుహన్ ఈ సినిమాతో తెలుగులో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.గతంలో తెలుగు హిట్ మూవీ హ్యాపీ డేస్ ని తమిళ్ లో డైరెక్టర్ గా రీమేక్ చేసిన గుహన్ ఈ సారిమాత్రం ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు.సినిమా లైన్ పరంగా కొత్తదనం ఉంది.దాన్నిడీల్ చేసిన విధానం కూడా పర్లేదు.కాకపోతే అంత చిన్న లిమిటెడ్ లైన్ లో చాలా అంశాలు టచ్ చెయ్యాలని ప్రయత్నించడంతో కొంత కన్ఫ్యూషన్ ఏర్పడింది.

పైగా థ్రిల్లర్ మోడ్ ని పూర్తిగా ఎలివేట్ చెయ్యలేకపోయాడు. ఇక అతను టచ్ చేసిన ల్యూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ రిటాలిటీ కి దూరంగా ఉందిఈ సినిమావరకు డైరెక్టర్ గా కొంతవరకు సక్సెస్ అయిన గుహన్ సినిమాటోగ్రాఫర్ గా మాత్రం ఫుల్ క్వాలిటీ అవుట్ ఫుట్ అందించాడు.ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఎస్సెట్ గా నిలిచింది.చిన్న సినిమాలకు హిట్ ఆల్బమ్స్ ఇచ్చే శేఖర్ చంద్ర ఈ సినిమాలో పాటల పరంగా ఎఫర్ట్స్ పెట్టె స్కోప్ గాని,అవసరంగాని లేదు.కానీ ఆర్.ఆర్ పరంగా మాత్రం సినిమాకి అవసరమయిన,సినిమాలో థ్రిల్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ అందించాడు.ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది.

చివరిగా:

118 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో,రెండు గంటల ఏడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆ జోనర్ సినిమాలు ఇష్టపడేవాళ్ళను కొంతవరకు మెప్పిస్తుంది.కళ్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు ఫలించినా పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పాస్ అయిపోయే అవకాశాలు మాత్రం ఉన్నాయి.

బోటమ్ లైన్:118 …అంతా మామూలే