Homeసినిమా వార్తలు‘అమిగోస్’ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు: క‌ళ్యాణ్ రామ్‌

‘అమిగోస్’ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు: క‌ళ్యాణ్ రామ్‌

Kalyan Ram About Amigos Movie:, Kalyan Ram next Amigos all set to release on February 10th. He talk about Amigos story on trailer launch event.. details inside

Kalyan Ram About Amigos Movie: డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి.

Kalyan Ram About Amigos Movie: ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , నిర్మాత య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ మాట్లాడుతూ ‘‘కర్నూలులో మేం నిర్వహిస్తోన్న మూడో ఈవెంట్ ఇది. క‌ర్నూలు మాకు చాలా సెంటిమెంట్‌గా మారింది. క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్‌గారు ఈరోజు చ‌నిపోవ‌టం చాలా బాధాక‌రం. వారి ఫ్యామిలీకి మా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసుకుంటున్నాను. ‘ఉయ్ మిస్ యు విశ్వ‌నాథ్‌గారు.మీరు శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం వంటి అద్భుత‌మైన సినిమాల‌ను ఇచ్చారు. జీవిత కాలంలో వాటిని అస్స‌లు మ‌ర‌చిపోలేం’. ఈవెంట్‌ను నిర్వ‌హించాలా..వ‌ద్దా? అని కూడా ఆలోచించాం. కానీ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తై చాలా దూరం రావ‌టంతో ఈవెంట్‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది.

అమిగోస్ సినిమా విషయానికి వస్తే సినిమాను మేం చూశాం. ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. రాజేంద‌ర్ రెడ్డి తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ అత్య‌ద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. సౌంద‌ర్ రాజ‌న్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. క‌ళ్యాణ్ రామ్‌గారి పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ చ‌క్క‌గా న‌టించింది. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఒకేలా మూడు వేర్వేరు ప్రాంతాల్లోని ఫ్రెండ్స్ ఒక‌చోట క‌లిసిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేది సినిమా క‌థ‌.

చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా ఉంటుంది. ఫ‌స్టాఫ్ చాలా బావుంది. సెకండాఫ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సినిమాను ఆసాంతం ఆస్వాదిస్తారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారిని క‌లిశాం. ఆయ‌న క‌ర్నూలులోని ఫ్యాన్స్ ఇచ్చే ట్రీట్‌మెంట్ గురించి చెప్పారు. ఆయ‌న చెప్పిన దాని కంటే ప‌ది రెట్టు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అభిమానుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆద‌రాభిమానాలు చూసి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. కొత్త సినిమాల‌ను చేసిన ప్ర‌తీసారి ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే వ‌చ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాత‌గారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు.

- Advertisement -

త‌ర్వాత త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌. అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూప‌ర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 10న మూవీ మీ ముందుకు రానుంది. ఎల్లుండి జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త‌మ్ముడు గెస్ట్‌గా వ‌స్తున్నాడు. జై ఎన్టీఆర్‌, జై హ‌రికృష్ణ‌, జై హింద్‌’’ అన్నారు.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY