Kalyan Ram Entha Manchivaadavuraa Remake of oxygen movie
Jr NTR, Kalyan Ram Next Movie Details

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ వస్తోన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా”. కాగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. గుజ‌రాతీ సినిమా ‘ఆక్సిజ‌న్’ మూవీ ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారట. కథ విషయానికి వస్తే.. నాట‌కం స్టేజ్‌ పైనే పుట్టిన హీరో.. ఆ తరువాత అతని లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా ఓ నాట‌క రంగమే అని నమ్ముతాడట. ఆ తరువాత అంద‌రికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడని.. ఈ సినిమా కథాంశం ఇదేనని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, అలాగే బన్నీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి పోటీగా “ఎంత మంచివాడవురా” సినిమా కూడా రాబోతుంది. మరి ఈ పోటీలో ఎవ్వరు నెగ్గుతారో చూడాలి.