NTR30 shooting Update: RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (NTR) కొరటాల శివ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NTR30 పేరుతో వస్తున్న ఈ సినిమా మా జూలైలోనే షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా, మెగాస్టార్ చిరు ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నందున, తారక్ స్క్రిప్ట్‌పై చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.
అందుకే NTR30 shooting లేట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. NTR30 సినిమాకి సహా నిర్మాతగా అయినా కళ్యాణ్ రామ్, కొరటాల శివ కి (NTR30) షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఎన్టీఆర్ (NTR), కళ్యాణ్ రామ్ లకు ఓకే కావడంతో.. సినిమా షూటింగ్ ఏమాత్రం ఆలస్యం కాకుండా ప్రారంభం అయ్యేలా సెట్ డిజైన్ పనులు ప్రారంభించాల్సిందిగా కొరటాల శివను కోరటం జరిగిందట.
అమీర్‌పేటలోని సారధి స్టూడియోస్‌లో జనతా గ్యారేజ్ కోసం ఎలా సెట్‌ను నిర్మించారో, ఇప్పుడు అలాంటి మరో భవనం దిల్ రాజు కోకాపేట స్థలంలో లేదా కొత్తగా ప్రారంభించిన అల్లు స్టూడియోస్‌లో వచ్చే వారం నుండి పనులు స్టార్ట్ అవుతాయని సమాచారం. కళ్యాణ్ రామ్ ఈ సెట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రస్తుతం కొరటాల తన ఆర్ట్-డైరెక్షన్ టీంతో బెస్ట్ విజువల్స్ వచ్చేలా బెస్ట్ సెట్‌ను రూపొందిస్తున్నారు అంట.
మరోవైపు, దర్శకుడు కొరటాల శివ NTR30 క్లైమాక్స్ పనుల్లో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ లేదా రష్మికా పేర్లు వినపడుతున్నాయి. దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. NTR30 షూటింగ్ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నా ఫ్యాన్స్ కి ఇది పండగ లాంటి న్యూస్ అని చెప్పవచ్చు.