Homeట్రెండింగ్సాయి ధరమ్ తేజ్ పై కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

సాయి ధరమ్ తేజ్ పై కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

Kalyan Ram Interesting Comments on Sai Dharam Tej's Virupaksha Movie, Heroine Samyuktha Emotional response to Kalyan Ram, Kalyan Ram comments on Sai Dharam Tej

Kalyan Ram Comments On Sai Dharam Tej: మూడు సంవత్సరాల తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమా విరూపాక్ష (Virupaksha) విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన ఏడు రోజులకే సినిమా దాదాపు 63 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. సాయి ధరమ్ తేజ్ ని అలాగే విరూపాక్ష దర్శకుని టాలీవుడ్ సెలబ్రిటీస్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Kalyan Ram Comments On Sai Dharam Tej: ఇప్పటికే సినిమాపై మెగా హీరోలు అందరూ ప్రశంసలు కురిపించగా, తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. సాయిధరమ్ తేజ్ అలాగే హీరోయిన్ సంయుక్త నటనను మెచ్చుకున్నారు. అలాగే దర్శకుడు కార్తీక్ దండు సినిమాని తెరకెక్కించిన విధానాన్ని ప్రశంసించారు. దీనికి సాయి ధరమ్ తేజ్ థాంక్యూ సో మచ్ అన్నా అంటూ రిప్లై ఇవ్వటం జరిగింది.

Kalyan Ram Interesting Comments on Sai Dharam Tej's Virupaksha Movie

అలాగే హీరోయిన్ సంయుక్త కూడా ఎమోషనల్ అవుతూ, నేను నందిని పాత్రను ఎంతగా ఇష్టపడ్డానో మీకు తెలుసు అయితే ఒకే రోజు విరూపాక్ష, డెవిల్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేశారంటూ రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తన రాబోయే సినిమా డెవిల్ షూటింగు లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు హైదరాబాదు లొకేషన్స్ లో సర్వే గంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బింబిసారా 2 షూటింగు మొదలుపెడతారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY