Homeసినిమా వార్తలుKalyan Ram Devil: 500 మంది ఫైటర్స్‌తో డెవిల్ యాక్షన్

Kalyan Ram Devil: 500 మంది ఫైటర్స్‌తో డెవిల్ యాక్షన్

Kalyan Ram Devil Movie shooting update, Devil action with 500 fighters: Devil Makers Canning an action episode with 500 fighters.. Nandamuri Kalyan Ram will be seen in all new mass avatar

Kalyan Ram Devil Movie shooting update: డిఫరెంట్ మూవీస్, రోల్స్ చేస్తూ హీరోగా తనదైన‌ వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌పై ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా డెవిల్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న ఉన్న మా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌రో డిఫ‌రెంట్ అవతార్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సినిమా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మంది ఫైట‌ర్స్‌తో ఈ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను వెంక‌ట్‌గారు నేతృత్వంలో చిత్రీక‌రిస్తున్నారు. దీన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్ప‌గా పిక్చ‌రైజేష‌న్ ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY