ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ ‘కళ్యాణం’ సాంగ్

0
11
Kalyanam Lyrical Song released from Anand Deverakonda Pushpaka Vimanam

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న “పుష్పక విమానం” చిత్రంలోని ఒక్కో పాట శ్రోతల ముందుకొస్తూ ఈ సినిమా మ్యూజికల్ హిట్ అని తేల్చేస్తున్నాయి. ఇప్పటికే ‘సిలకా..’ అనే పాట రిలీజ్ అయి మంచి హిట్ కాగా…తాజాగా ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు.

ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు సమంత. ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ తనకు బాగా నచ్చిందని చెప్పిన సమంత….హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత విజయ్ దేవరకొండ సహా “పుష్పక విమానం” ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

“పుష్పక విమానం” సినిమాలో ఇలాంటి అందమైన పాటలతో పాటు ఆసక్తికర సన్నివేశాలు త్వరలో వెండితెరపై చూపించబోతున్నారు. ఆనంద్ దేవరకొండ , గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, నేపథ్య సంగీతం : మార్క్ కె.రాబిన్, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర