Indian 2 Shooting Video: షూటింగ్ లో సందడి చేసిన కమల్ హాసన్ – శంకర్

Indian 2 Shooting Update: కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలు పెట్టారు. అనుకోని కారణాలవల్ల అలాగే ప్రొడ్యూసర్స్ మరియు శంకర్ కి మధ్య విభేదాలు రావటంతో తో సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇండియన్ 2 (Indian 2) సినిమా ఆగిపోవడం తో శంకర్ రామ్ చరణ్ హీరోగా RC15 సినిమాను మొదలు పెట్టారు. అయితే కొన్ని నెలల క్రితం ప్రొడ్యూసర్స్ తో ఉన్న విభేదాలు తొలగిపోవడంతో అలాగే ఇదే సమయంలో యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ని ఈ మూవీని సహ భాగస్వామిగా చేర్చి ఎట్టకేలకు ఆగిపోయిందని భావించిన ‘ఇండియన్ 2’ని పట్టాలెక్కించాడు కమల్ హాసన్ (Kamal Haasan).

ఇటీవలే తిరిగి పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ (Indian 2 Shooting) మళ్లీ మొదలైంది. శంకర్ చెప్పిన విధంగా కమల్ హాసన్ తో ఈరోజు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. సెట్ లోకి స్వాగతం పలికి కమల్ కు శంకర్ సీన్ ని వివరిస్తున్న వీడియోని (Indian 2 Video) కమల్ సోషల్ మీడియా ఏదికగా షేర్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలోని కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్ధ్ గుల్షన్ గ్రోవర్ ప్రియా భవానీ శంకర్ సముద్రఖని బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు. కాజల్ అగ్వాల్ హీరోయిన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ 2 షూటింగ్ సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

 

Related Articles

Telugu Articles

Movie Articles