kamal haasan hospitalized and he is back to home after leg surgery
kamal haasan hospitalized and he is back to home after leg surgery

నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు..లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఇటీవలే ఆయన ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే..! ఆయనకు ఏమైందా అని అభిమానులు మొదట తెగ టెన్షన్ పడ్డారు. చివరికి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు.

కమల్ హాసన్ గత కొంత కాలంగా కాలు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. దీంతో కొద్దిరోజుల క్రితం కమల్‌ హాసన్‌ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ఆ సమయంలో ఆయన కాలులో స్టీల్‌ప్లేట్‌ను అమర్చారు. ఇక కమల్ హాసన్ అంటేనే బిజీ షెడ్యూల్.. ఓ వైపు పార్టీ కార్యక్రమాలు.. మరో వైపు సినిమాలు దీంతో ఆయన అమర్చిన స్టీల్‌ప్లేట్లను తొలగించడం కుదరలేదు. కొద్దిరోజుల క్రితం వైద్యుల సలహా మేరకు కమల్‌ హాసన్‌ స్థానిక అపోలో ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స ద్వారా కాలులోని స్టీల్‌ప్లేట్‌ను తొలగించారు. మూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న కమలహాసన్‌ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. జనవరి వరకూ కమల్‌హాసన్‌ సినీ, రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కమల్ ప్రస్తుతం ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తున్నారు. 1996లో వచ్చిన భారతీయుడు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రకుల్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.