ఖైదీ దర్శకుడితో కమల్.. రాజకీయ నేపథ్యంలో…!

kamal haasan new movie announced which is directed by lokesh kanagaraj

Kamal Haasan Lokesh Kanagaraj: ఇటీవలే ‘ఖైదీ’ సినిమాతో సత్తా చాటిన లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్ హాసన్ తన కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమాలో రజనీకాంత్‌ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో కూడిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. ఇది విలక్షణ నటుడు కమలహాసన్ నటించే 232వ చిత్రం. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

”ఒకానొక సమయంలో అక్కడ ఓ దెయ్యం నివసించింది” అని పేర్కొంటూ కేవలం తుపాకులతో హీరో కమల్ హాసన్ రూపాన్ని ప్రేక్షకుల ముందుంచారు. చూడటానికి ఎంతో డిఫరెంట్‌గా ఉన్న ఈ పోస్టర్, దానిపై రాసి ఉన్న ఆ దెయ్యం కోట్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పేసింది. అతిత్వరలో ఈ మూవీ ఇతర నటీనటుల వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్. మరోవైపు శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ మూవీ చేస్తున్నారు కమల్ హాసన్.