sekhar Kammula Chaitanya Sai Pallavi's movie locks release date
sekhar Kammula Chaitanya Sai Pallavi's movie locks release date

(Check out Sekhar Kammula Chaitanya Sai Pallavi’s love story movie latest updates and release date details)శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినబడుతుంది. ఈ చిత్రం ఏఎన్నార్, నాగార్జున కు చెందిన హిట్ సినిమాల పాటలకు నాగచైతన్య స్టెప్స్ వెయ్యబోతున్నాడట. ఒక విల్లెజ్ సంబరాలలో నేపథ్యంలో ఇది ఉండబోతుందట. గతంలో 100% లవ్, మనం సినిమాలలో నాగచైతన్య ఇలాగే డాన్స్ చేశాడు. ఈ వార్తతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

గత ఏడాది ‘మజిలీ’ తో బ్లాక్ బస్టర్… ‘వెంకీమామ’ తో సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్లో ఉన్న యువసామ్రాట్ నాగ చైతన్య..నాగచైతన్యకు ఇది 19వ చిత్రం కావడం విశేషం. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల నుండీ రాబోతున్న చిత్రం కావడంతో ఈ ‘లవ్ స్టోరీ’ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసినట్టు తాజా సమాచారం. గత ఏడాది ఏప్రిల్ కు ‘మజిలీ’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగచైతన్య ఈసారి కూడా ఏప్రిల్ కే రాబోతున్నాడట. అవును ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ దాస్‌ నారంగ్‌, పీ రామ్‌ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సీహెచ్‌ పవన్‌ సంగీతమందిస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఈ మధ్యనే ఫిదాతో పెద్ద హిట్ ఇచ్చాడు. ఇక యూత్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దీనితో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. గతంలో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ఇద్దరి కొత్తవాళ్ళతో మొదలు పెట్టాడు. అయితే కొంత షూటింగ్ అయ్యాకా సినిమా మీద అనుమానాలు రావడంతో ఆపేశారు. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ భారీ రేటు పలుకుతుందట. ఏకంగా 5.25 కోట్లు పలుకుతున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది హైయెస్ట్ నెంబర్ అని చెప్పాలి.