‘కాంచన 3’ నటి అలెగ్జాండ్రా జావి మృతి..!

0
561
Kanchana 3 Actress Alexandra Djavi Found Dead In Goa

Alexandra Djavi Death: రాఘవ లారెన్స్ హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ‘కాంచన3’ మూవీలో ఓ హీరోయిన్ గా అలాగే దెయ్యంగా నటించి మెప్పించింది రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప‌గ తీర్చుకునే దెయ్యం పాత్ర‌లో అద్భుతంగా న‌టించిన అలెగ్జాండ్రా త‌న అద్దె ఇంట్లో ఉరి వేసుకొని చ‌నిపోయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

గోవాలోని ఓ హోటల్ రూంలో ఆమె బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కారణం ఆమె ప్రియుడే అని తెలుస్తుంది.ఇటీవల అలెగ్జాండ్రా జావి తన ప్రియుడితో బ్రేకప్ అయ్యింది. దాంతో ఆమె డిప్రెషన్ కు గురయ్యి ఇలా ఆత్మహత్య చేసుకున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే అవకాశం ఉందని, ఆ కోణంలో కూడా విచారణ చేపడతామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Shocking! 24 year old 'Kanchana 3' actress Alexandra Djavi found dead

2019లో ఈ అమ్మ‌డు చెన్నై ఫొటోగ్రాఫ‌ర్‌పై లైంగిక వేధింపులు చేస్తున్నాడ‌ని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో అత‌ని వ‌ల్ల ఏమైన చ‌నిపోయిందా అనే కోణంలోను పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. కాబట్టి.. ఇది ఆత్మహత్యా లేక హత్య అని అప్పుడే నిర్దారించలేమని.. అన్ని వైపుల నుండీ దర్యాప్తు చేసి అప్పుడు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక 24 ఏళ్ళ వయసుకే అలెగ్జాండ్రా జావి మరణించడం విషాదకరం అంటున్నారు లారెన్స్,వేదిక వంటి సెలబ్రిటీలు.