Kangana Ranaut shocking comments on tollywood

Kangana Ranaut Comments on Tollywood: టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాద్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని తాము నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆయన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది.

‘భారతదేశంలో బాలీవుడ్ అతిపెద్ద చిత్ర పరిశ్రమ అని ప్రజలకు తప్పుడు అవగాహన ఉంది. కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ శాసిస్తోంది. బాలీవుడ్ చిత్రాలు చాలా వరకు షూటింగ్‌లు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాయని’ ఆమె పేర్కొన్నారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరంగా పాన్ ఇండియన్ ప్రాజెక్టులను రూపొందిస్తోంది. ‘భారతదేశంలో అగ్రశ్రేణి చిత్ర పరిశ్రమ.. హిందీ చిత్ర పరిశ్రమ అని ప్రజల అభిప్రాయం తప్పు. తెలుగు చిత్ర పరిశ్రమ తనను తాను అగ్రస్థానంలో నిలుపుకుంది. బహు భాష సినిమాలు చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేయడంలో తెలుగు సినిమా ముందుంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

హాలీవుడ్ తరహాలో ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంను కంగనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్న 8 టెర్రరిజంలు ఎత్తి చూపింది. ఆ ఎనిమిది సమస్యలు పూర్తిగా తొలగించినప్పుడు మాత్రమే మంచి సినిమాలు వస్తాయనే అభిప్రాయంను వ్యక్తం చేసింది. కంగనా తెలుగులో ప్రభాస్‌కు జోడిగా ఏక్‌ నిరంజన్‌ చిత్రంలో నటించింది.