వర్మ హీరోయిన్‌పై నోరుజారిన కంగనా

0
666
kangana ranaut sensation comments on oormila matondkar

Kangana Ranaut: Urmila Matondkar: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్లీ నోరు పారేసుకుంది. సీనియర్ నటి ఊర్మిళను అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్ అంటూ వ్యాఖ్యానించింది.

డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌లో సెగలు రేపుతూనే ఉంది. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో పార్లమెంటులో బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి, సమాజ్‌‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా స్పందించారు.

సినిమా ఇండస్ట్రీ వల్ల బాగుపడిన వారే అవసరం తీరాక ఆ పరిశ్రమను కించపరిచేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో రంగంలోకి దిగిన కంగనా నోరు పారేసుకుంది. అభిషేక్ బ‌చ్చన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ బాధేంటో జయాబచ్చన్‌కు తెలిసేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే హాట్ హీరోయిన్ ఊర్మిళను మధ్యలోకి లాగింది. ఆమెకు నటన రాదని, అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసంది. ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌ స్టార్ అంటూ నీచంగా మాట్లాడింది. ఇటీవల కంగనా తీరును ఊర్మిళ తప్పుబట్టింది. దీంతో కంగనా ఇలా రెచ్చిపోయిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.