‘తలైవి’ రివ్యూ & రేటింగ్

0
367
kangana Ranaut Thalaivi Telugu Movie Review Rating

kangana Ranaut Thalaivii Movie Review Rating
విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021
రేటింగ్ : 3/5
నటీనటులు: కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముతిరఖని, మధు బాల
దర్శకుడు: విజయ్ ఎ ఎల్
నిర్మాత‌లు: విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్
సంగీత దర్శకుడు: జి వి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విశాల్ విట్టల్
ఎడిటర్: ఆంటోనీ

మ‌హిళా పాత్ర‌ల‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది కంగ‌న రనౌత్‌. వ‌రుస‌గా నాయికా ప్రాధాన్య‌మున్న క‌థ‌ల్ని చేస్తూ బాక్సాఫీసుపై త‌న‌దైన ప్ర‌భావం చూపిస్తోంది. మరి ఈ క్రమంలో వచ్చిన మరో గ్రాండ్ బయోపిక్ సినిమా ‘తలైవి’. తమిళ ప్రేక్షక జనం ‘అమ్మ’ అని పిలుచుకునే జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో ఈరోజే రిలీజ్ అయ్యింది.

కథ:
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె ముఖ్య‌మంత్రిగా ప‌దివిని చేప‌ట్టేవ‌ర‌కు సాగే క‌థ ఇది. ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో జ‌య (కంగ‌న‌ ర‌నౌత్‌) సినీ రంగ ప్ర‌వేశం చేస్తుంది. ఇష్టం లేక‌పోయినా ఆమె కెమెరా ముందుకు అడుగు పెట్టాల్సి వ‌స్తుంది. ఆ త‌ర్వాత స్టార్‌గా ఎదుగుతుంది.

kangana Ranaut Thalaivi Telugu Movie Review Rating

ఆమె తెర ప్ర‌వేశం చేసేనాటికే పెద్ద స్టార్‌గా.. ఆరాధ్య క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల మ‌నసుల్లో తిరుగులేని స్థానం సంపాదించిన ఎంజీ రామ‌చంద్ర‌న్ అలియాస్ ఎంజీఆర్‌ (అర‌వింద్ స్వామి)తో ఆమెకి ఎలా అనుబంధం ఏర్ప‌డింది? ఆమె రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఎంజీ రామ‌చంద్ర‌న్ ఎలా కార‌ణ‌మ‌య్యారు? జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రి పీఠం చేప‌ట్టే క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? త‌దిత‌ర విష‌యాలతో సినిమా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్
జయలలిత బయోపిక్ కావడం
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల పనితనం

మైనెస్ పాయింట్
ఉద్వేగం కలిగించని సన్నివేశాలు
ఆసక్తి రేకెత్తించని స్క్రీన్ ప్లే

నటీనటులు:
జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌న ఒదిగిపోయారు. సినీ కెరీర్ ఆరంభంలో జ‌య క‌నిపించిన విధానం మొద‌లుకొని… ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక మారిన క్ర‌మం వ‌ర‌కు కంగ‌న త‌న‌ని తాను శారీర‌కంగా మార్చుకుంటూ న‌టించారు. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ స్వామి కూడా జీవించారు. న‌టుడిగానూ… రాజ‌కీయ నాయ‌కుడిగానూ ప్ర‌త్యేకమైన హావ‌భావాలు ప‌లికిస్తూ న‌టించారు. జ‌య త‌ల్లిగా భాగ్య‌శ్రీ, ఎంజీఆర్ భార్య‌గా మ‌ధుబాల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

kangana Ranaut Thalaivi Telugu Movie Review Rating

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కానీ టెక్నీకల్ విభాగం పని తీరు కానీ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. క‌రుణ పాత్ర‌లో నాజ‌ర్ క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జీవి సంగీతం, విశాల్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, విజ‌య్ ర‌చ‌న మెప్పిస్తుంది. ఇంకా విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ కూడా మళ్ళీ పాత రోజులని మరపిస్తుంది చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే ఆంటోనీ ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టుగా నీట్ గా ఉంది.

విశ్లేషణ:
1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జయలలితకు జరిగిన అవమానంతో మొదలైన ఈ సినిమా… ఫ్లాఫ్ బ్యాక్ లో సాగి… చివరకు 1991 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో జయలలిత గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. ప్రథమార్థంలో ఎక్కువగా జయలలిత, ఎంజీఆర్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారానికి ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు విజయ్, ద్వితీయార్థంలోనే జయలలిత అంటే ఏమిటో చూపించే ప్రయత్నం చేశాడు.

kangana Ranaut Thalaivi Telugu Movie Review Rating

ఒక ప‌క్క ఎంజీఆర్ స్టార్ స్టేట‌స్‌నీ, ఆయ‌న రాజ‌కీయాల‌పై చూపిస్తున్న ప్ర‌భావాన్ని హైలైట్ చేస్తూనే జ‌య జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. జ‌య – ఎంజీఆర్ మ‌ధ్య బంధాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు కూడా మెప్పిస్తుంది. జయలలితకు, తల్లికి మధ్య ఉన్న అనుబంధం, ఎంజీఆర్ జీవితంలో ఆమెకు ఉన్న ప్రాధాన్యం వీటి చుట్టూనే ప్రథమార్థం సాగింది. సినిమా రంగంలో ఉండే రాజకీయాలను కొంతలో కొంత చూపించే ప్రయత్నం చేశారు.

గాఢ‌మైన ప్రేమ‌క‌థ స్థాయి భావోద్వేగాలు పండాయి. అదే ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌, అదే ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు ఆ ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయం దూరం పెంచ‌డం, ఆ త‌ర్వాత అదే రాజ‌కీయం కోసం ఇద్ద‌రూ క‌ల‌వ‌డం వంటి డ్రామా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధం క‌థ మొత్తం రాజ‌కీయం చుట్టూనే సాగుతుంది. జ‌య రాజ్య‌స‌భకి వెళ్ల‌డం, ఇందిరాగాంధీని క‌ల‌వ‌డం, ఎంజీఆర్‌కి అనారోగ్యం, ఆ త‌ర్వాత చోటు చేసుకునే ప‌రిణామాలు ఉత్కంఠ‌ని రేకెత్తిస్తాయి.

kangana Ranaut Thalaivi Telugu Movie Review Rating

 

కానీ ఇంకొన్ని జాగ్రత్తలు, జయలలిత జీవితంపై ఇంకా తెలియని ఏవైనా కోణాలు చూపి ఉంటే బాగుండేది. మొత్తం మీద నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కోసం జయలలిత బయోపిక్ ‘తలైవి’ని చూడొచ్చు.