పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటులు శ్రీ సుదీప్ గారు భేటీ

0
314
kannada hero sudeep meet Janasena chief Pawan Kalyan (1)

sudeep: Pawan Kalyan: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిని ప్రముఖ నటులు, కన్నడ కథానాయకుడు శ్రీ సుదీప్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయానికి శ్రీ సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారికి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది.

కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి… ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి శ్రీ సుదీప్ గారు వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

kannada hero sudeep meet Janasena chief Pawan Kalyan (1)

Previous articleSolo Brathuke So Better to get a direct OTT release with ZeePlex
Next articleబంజారా సినీ పరిశ్రమ ‘బంజారావుడ్’ ప్రారంభం!